: మర్యాదగా చెబుతున్నా... సిగ్గులేదా?... పిచ్చిపిచ్చి గంతులు వెయ్యొద్దు: వైకాపా సభ్యులపై బాబు కోపాగ్ని
నాపై రౌడీయిజం మీ నాన్న వల్లే కాలేదు... నీ వల్ల ఏం అవుతుంది? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా నేత జగన్ ను ఉద్దేశించి అనడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, పోడియం వైపు దూసుకొచ్చారు. దీంతో చంద్రబాబు కోపంగా వైకాపా నేతలపై విరుచుకుపడ్డారు. 'మర్యాదగా చెబుతున్నా... కూర్చోండి. మీకు సిగ్గులేదా? పిచ్చిపిచ్చి గంతులు వేస్తున్నారు. మిమ్మల్ని ఎవరినీ వదిలిపెట్టను. జాగ్రత్త, రౌడీ రాజకీయాలు చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ముందు ఎవరి సీట్లో వారు కూర్చోండి. ప్రతిపక్ష నేత సభలో 'అగ్లీ సీన్' క్రియేట్ చేస్తానని అన్నాడు. అది ఇదేనా?' అంటూ దుయ్యబట్టారు.