: జగన్... మీ రౌడీయిజానికి భయపడం!: 'సాక్షి'పై ఒంటికాలిపై లేచిన అచ్చెన్నాయుడు
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఒంటికాలిపై లేచారు. ఓ వైపు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జగన్ పై విరుచుకుపడ్డ మరుక్షణమే, చంద్రబాబు స్థాయిలోనే అచ్చెన్నాయుడు కూడా ఫైరయ్యారు. ‘‘జగన్... మీ రౌడీయిజానికి భయపడేది లేదు. మీ సాక్షి ప్రతిక ఓ చిత్తు కాగితం. మీ పత్రికలో రాస్తున్న ప్రతి అక్షరం అబద్ధమే. మీ పత్రిక రాస్తున్న అవాస్తవాలను సభలో వల్లిస్తే ఒప్పుకునేది లేదు’’ అంటూ అచ్చెన్నాయుడు జగన్ పై మాటల తూటాలు పేల్చారు.