: హైదరాబాదులో బందోబస్తు మా బాధ్యత కాదు... అంగన్ వాడీలకు చంద్రబాబు వార్నింగ్
డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాదు పేరిట ఆందోళన బాట పట్టిన అంగన్ వాడీలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే ఆందోళనను విరమించాలని ఆయన అంగన్ వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో బందోబస్తు బాధ్యతలు ఏపీ ప్రభుత్వ పరిధిలోకి రావని చెప్పిన ఆయన, ఆందోళనలో ఏదైనా జరిగితే తాము బాధ్యులం కామన్న రీతిలో అంగన్ వాడీలను హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలకు చోటివ్వకుండా అంగన్ వాడీ కార్యకర్తలు తక్షణమే ఆందోళన విరమించాలని ఆయన సూచించారు.