: తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యాప్రమాణాలు పడిపోయాయి... 16 కాలేజీలపై కేసులు పెట్టాం: కడియం శ్రీహరి


తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలలో విద్యాప్రమాణాలు పడిపోయాయని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, జేఎన్టీయూను తప్పుదోవ పట్టించిన 16 ఇంజినీరింగ్ కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డాయి. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత శ్రీహరి మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని... ఇప్పటికే రూ. 1700 కోట్లను విడుదల చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News