: తలసానిపై వేటు వేయాలి... తెలంగాణలో కుటుంబ పాలన: ఢిల్లీలో టీ టీడీపీ నేతల వ్యాఖ్య


టీడీపీ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా కొనసాగుతున్న తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు టీ టీడీపీ నేతల బృందం తెలిపింది. అసెంబ్లీలో తమ సస్పెన్షన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాదు నుంచి బయలుదేరిన వారంతా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనపైనా రాష్ట్రపతికి పిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీ వచ్చామని వారు పేర్కొన్నారు. తెలంగాణ శాసనమండలిలో టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News