: పక్క రాష్ట్రాల వారు అర్థం చేసుకున్నారు... చంద్రబాబే అర్థం చేసుకోవడం లేదు: రోజా


వైకాపా ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై సభలో గందరగోళం చెలరేగడంతో... స్పీకర్ కోడెల సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అంగన్ వాడీలకు జీతం తక్కువగా ఉందని విమర్శించారు. అంగన్ వాడీల బాధలను ఇతర రాష్ట్రాల వారు అర్థం చేసుకున్నారని... కానీ, మన ముఖ్యమంత్రికే అర్థం కావడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. తమ బాధలను సీఎంకు చెప్పుకుందామని హైదరాబాద్ వచ్చిన అంగన్ వాడీలను... పోలీసులు లాక్కొని పోవడం దారుణమన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. అంగన్ వాడీల తరఫున వైకాపా పోరాడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News