: దర్శకుడు పూరీ ఇంట్లో నగలు దొంగిలించింది పనిమనిషేనట!


హైదరాబాదులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నివాసంలో నాలుగు రోజుల కిందట జరిగిన నగల చోరీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను పూరీ ఇంట్లో పనిచేసే పనిమనిషే దొంగిలించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే విషయాన్ని పూరీ మీడియాకు తెలిపారు. నగలు పోయినందుకు తమకు కోపం లేదని, కానీ నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు తన భార్య చాలా బాధపడిందని చెప్పారు. దొంగిలించిన నగలను పనిమనిషి తన బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చిందని, అతను పరారీలో ఉన్నాడని వివరించారు. ప్రస్తుతం అతనికోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు. గత నాలుగేళ్లుగా ఆమె తమ ఇంట్లో పనిచేస్తుందని, ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదన్నారు. తామంతా ఆమెను చాలా నమ్మామని, తన భార్య ఇంట్లో లేనప్పుడు లాకర్ తాళాన్ని దొంగిలించి ఈ పనికి పాల్పడిందని పూరీ వివరించారు.

  • Loading...

More Telugu News