: అంగన్ వాడీ సమస్యలపై చర్చకు వైసీపీ పట్టు... ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై చర్చ కోసం ప్రతిపక్ష వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. దీంతో సదరు అంశంపై చర్చకు అనుమతివ్వాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో విపక్ష సభ్యుల నిరసనలతోనే సభ ప్రారంభమైనట్లైంది. అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి చర్చ జరగకుండానే సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News