: విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం... తగలబడిపోతున్న ఆంధ్రా ఫెర్రో ఎల్లాయిస్ కర్మాగారం
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాంలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామ పరిధిలోని ఆంధ్రా ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కర్మాగారం తగలబడిపోతోంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో కార్మికులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ గాయపడలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. ట్రాన్స్ ఫార్మర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.