: ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ సీట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్ లకు మొండిచెయ్యి చూపుతూ కొత్త వారిని ఖరారు చేశారు. విశాఖపట్టణం నుంచి గుమ్మడి సంధ్యారాణిని ఖరారు చేయగా, తూర్పుగోదావరి నుంచి వీవీవీ చౌదరిని, అనంతపురం జిల్లా నుంచి తిప్పేస్వామిని ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు పంపనున్నారు. గవర్నర్ కోటాలో ఎస్సీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.