: ప్రారంభమయిన రాముడి పట్టాభిషేకం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమం మిధిలామండపంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.