: ఆధార్ తప్పనిసరి కాదు... కేంద్రానికి మరోసారి స్పష్టం చేసిన సుప్రీం
ప్రతి సంక్షేమ పథకానికి, సామాజిక భద్రతా పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరికాదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ప్రతి పథకానికి ఆధార్ ను లింక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను నేడు విచారణకు స్వీకరించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డుపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్డుకు సంబంధించి ప్రజలను ఒత్తిడి చేయొద్దని సూచించింది. కాగా, గత సంవత్సరం ఇవే తరహా ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వగా, వాటిని కేంద్రం పక్కనబెట్టిన సంగతి తెలిసిందే.