: యూత్ కాంగ్రెస్ ర్యాలీకి పోలీసుల అడ్డు... ఢిల్లీలో ఉద్రిక్తత


భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ముట్టడి లక్ష్యంగా సాగుతున్న ర్యాలీని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తొలుత, బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. దీంతో, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డారు. వాటర్ క్యానన్లు ప్రయోగించి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

  • Loading...

More Telugu News