: యూఎస్ చరిత్రలో తొలిసారిగా ముస్లిం కళాశాలకు అధికారిక గుర్తింపు
దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం కళాశాలకు అధికారిక గుర్తింపు ఇచ్చినట్టు అమెరికా తెలిపింది. కాలిఫోర్నియాలోని బర్క్ లీకి సమీపంలో రెండు అద్దె భవనాల్లో కొనసాగుతున్న జేతునా ముస్లిం కళాశాలకు గుర్తింపు లభించింది. 2008లో ప్రారంభమైన జేతునా, ఆ తదుపరి సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించింది. ఈ కాలేజీ రాజకీయాలు, మతం, నీతిశాస్త్రం విభాగాల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. 2013లో 30 మంది విద్యార్థులు ఇక్కడ చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరం లో కళాశాలకు గుర్తింపు రావడంతో మరింత మంది విద్యార్థులు వస్తారని యాజమాన్యం సంతోషపడుతోంది.