: హర్యానాలో నిర్మాణంలో ఉన్న చర్చి ధ్వంసం... ఆ స్థానంలో హనుమాన్ విగ్రహం ఏర్పాటు


హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ లో ఉన్న కైమ్రి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న చర్చి బిల్డింగ్ ను స్థానికులు ధ్వంసం చేశారు. ఆ స్థానంలో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానికులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గృహ ప్రయోజనాల కోసం ఆ బిల్డింగును నిర్మిస్తున్నారని, చర్చి పాస్టర్ సుభాష్ చంద్ మత మార్పిడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అయితే ఓ నెల కిందట భజరంగ్ దళ్ కార్యకర్తలు తనను బెదిరించారని, ఈ దాడి వెనుక వారున్నారని పీటీఐతో పాస్టర్ అంటున్నాడు. ఇదిలాఉంటే చర్చి బిల్డింగ్ నిర్మాణంవల్ల తమకెలాంటి ఇబ్బంది లేదని స్థానికులు అంటుండగా, పాస్టర్ అతని మత ప్రచారానికి పాల్పడుతూ మత మార్పిడులకు ప్రేరేపిస్తున్నారని అంటున్నారు.

  • Loading...

More Telugu News