: హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ చిన్నారెడ్డి... మధ్యలో వెంకయ్యను కూడా లాగారు


తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ రోజు మరింత వేడిగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. వెంటనే కలుగజేసుకున్న మంత్రి హరీష్ రావు... దీనికంతటికీ కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేషే ఈ బిల్లును తయారు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి కల్పించుకుని... ఏదైనా మాట్లాడేటప్పుడు విషయం తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. విభజన లాంటి బిల్లులు కేంద్ర హోంశాఖ పరిధిలో తయారవుతాయని... పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న జైరామ్ రమేష్ ఈ బిల్లును ఎలా తయారు చేస్తారని హరీష్ ను ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ బిల్లును ఆమోదింపజేసిన సంగతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ కు చిన్నారెడ్డి చురక అంటించారు.

  • Loading...

More Telugu News