: 13 ఏళ్లకే ఏకే-47 పట్టిన బాలుడు... అరెస్ట్ చేసిన పోలీసులు


వాడు ముక్కుపచ్చలారని 13 సంవత్సరాల బాలుడు. అయితేనేం, పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన హత్యల గ్యాంగ్ లో సభ్యుడు. చేతిలో ఏకే-47 తుపాకీ, పిస్టల్, క్యాట్రిడ్జ్ లు, మాదకద్రవ్యమైన మరిజువాన తదితరాలతో మెక్సికన్ పోలీసులకు దొరికిపోయాడు. ఈశాన్య మెక్సికో ప్రాంతంలో ఇటీవల జరిగిన పలు హత్యలతో సంబంధమున్న సినలోకోస్ గ్యాంగ్ లో 'హిట్ బాయ్'గా పేరున్న సభ్యుడని స్థానిక మీడియా వెల్లడించింది. బాలుడి వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలను విశ్లేషించామని, వీటితో అతను నేరాలేవీ చేయలేదని గుర్తించామని పోలీసులు తెలిపారు. బాలుడి పేరును వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News