: దేశికన్ కోసం రెండు గంటల పాటు సర్వదర్శనం రద్దు... టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం
అహోబిల మఠాధిపతి దేశికన్, ఆయన శిష్యగణం కోసం టీటీడీ అధికారులు వెంకన్న భక్తులను ఇబ్బందుల పాల్జేశారు. నేటి ఉదయం తిరుమల వచ్చిన దేశికన్ కు వెంకన్న దర్శనభాగ్యాన్ని కల్పించేందుకు టీటీడీ అధికారులు సర్వ దర్శనానికి బ్రేకిచ్చారు. దాదాపు రెండు వేల మందితో తిరుమల చేరుకున్న దేశికన్, రెండు గంటల పాటు తిరుమలేశుడిని దర్శించుకున్నారట. దేశికన్ కు సాగిలపడ్డ టీటీడీ అధికారులు రెండు గంటల పాటు సాధారణ భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో టీటీడీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరి కోసం రెండు గంటల పాటు బ్రేక్ దర్శనమేమిటని నిలదీశారు. సిఫారసులతో ప్రముఖులకు స్థాయికి మించిన ప్రాధాన్యమిస్తున్న అధికారులు... భక్తుల ఆందోళనలను లైట్ గా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.