: ఫలితాల రోజున ధ్యాన ముద్రలో మోదీ... టీవీ చూడలేదట, ఫోనూ ముట్టని వైనం!


మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటిదాకా ఎన్నడూ జరగనంత భారీ ఎత్తున బీజేపీ ప్రచారం చేసింది. పార్టీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ కాళ్లకు చక్రాలు కట్టుకున్న రీతిలో క్షణం తీరిక లేకుండా తిరిగారు. సరికొత్త తరహాలో వెబ్ ఆధారిత ప్రచారం హోరెత్తింది. ఎన్నికలు ముగిశాయి. మే 16న కౌంటింగ్ ప్రారంభమైంది. సాధారణంగా గెలుస్తామా? లేదా? అన్న ఉత్కంఠతో నేతలు కొట్టుమిట్టాడే పరిస్థితి. అయితే గెలుపుపై ధీమానో, లేక ఆందోళన ఎందుకన్న భావనో తెలియదు కాని... నరేంద్ర మోదీ మాత్రం ధ్యాన ముద్రలో మునిగిపోయారట. అంతేకాదు, టీవీ సైతం చూడలేదట. ఇక ఫోన్ ను అసలే ముట్టుకోలేదట. ‘ద మోదీ ఎఫెక్ట్: ఇన్ సైడ్ నరేంద్ర మోదీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్ ఫామ్ ఇండియా’ పుస్తకంలో ఈ విషయాలను మోదీనే స్వయంగా వెల్లడించారు. నాడు మధ్యాహ్నం 12 గంటలకు అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసేదాకా మోదీ అసలు మన ధ్యాసలోనే లేరట. ఓట్ల లెక్కింపులో పార్టీ దూసుకెళుతోంది, సొంతంగానే మెజారిటీ వస్తుందని మోదీ అటెండ్ చేసిన తొలి ఫోన్ కాల్ లో రాజ్ నాథ్ చెప్పారట.

  • Loading...

More Telugu News