: బీజేపీకి ఓటేస్తే బాబుకు వేసినట్లే!: కేటీఆర్


తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతిస్తున్న బీజేపీ మండలి అభ్యర్థులను ఓడించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిలబడ్డ బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే, అది తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు వేసినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలైతే, చెరో స్థానంలో పోటీ చేయాలని, తాము అభ్యర్థులను నిలిపితే ఓడిపోతామని భావించే, భాజపాను అడ్డంపెట్టుకొని బాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. భాజపా అభ్యర్థుల గెలుపు కోసం రూ.కోట్లు కుమ్మరించి ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News