: తెలంగాణలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ... టీఆర్ఎస్ లో చేరుతున్న సాగర్ నేత చిన్నపరెడ్డి


కీలక నేతల వలసలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డికి మొన్నటి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి నల్లగొండ జిల్లాలో టీడీపీ సత్తా చాటిన తేరా చిన్నపరెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి నేడు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. చిన్నపరెడ్డితో పాటు గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర కమిటీలో పలు హోదాల్లో పనిచేసిన రమణానాయక్ లు కూడా టీఆర్ఎస్ అధినేత, టీఎస్ సీఎం కేసీఆర్ సమక్షంలో నేటి మధ్యాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News