: నిన్ను హీరోను చేస్తా!: బాల 'మగధీర'కు మాటిచ్చిన రాంచరణ్


బాల 'మగధీర'గా సామాజిక వెబ్ సైట్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లాకు చెందిన పరశురామ్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడు హీరో రాంచరణ్ ను కలిశాడు. ఈ సందర్భంగా బాలుడు వల్లె వేసిన సినిమా డైలాగులను రాంచరణ్ ఆసక్తిగా విన్నాడు. డైలాగులు అద్భుతంగా చెబుతున్నాడని రాంచరణ్ అభినందించాడు. 'డైలాగులు చెప్పడం కాదు, బాగా చదువుకుంటావా? చదివిస్తా'నని రాంచరణ్ బాలుడ్ని అడిగాడు. 'బాగా చదువుకుంటే పెద్దయ్యాక కలుస్తా'నని మాటిచ్చాడు. బాగా చదువుకుంటే తానే ఉద్యోగం ఇస్తానని కూడా అన్నాడు. అప్పటికీ బాలుడు డైలాగులు చెప్పడంతో 'బాగుంది, పెద్దయ్యాక ఏమవుతా'వని ప్రశ్నించాడు. సినిమా హీరో అవుతానని చెప్పడంతో, 'సరే బాగా చదువుకో, హీరోని చేస్తా'నని అన్నాడు. బాలుడికి 'ఆరెంజ్' సినిమాలో తాను ధరించిన టీ షర్టును బహుమతిగా అందజేశాడు.

  • Loading...

More Telugu News