: నెలాఖరుకల్లా 10 వేల కోట్లు వస్తాయి: సుజనా చౌదరి


కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెలాఖరుకల్లా పది వేల కోట్ల రూపాయలు వస్తాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఢిల్లీలో ఆయన పలువురు మంత్రులను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి వచ్చే ఏడాది రెండు వేల కోట్ల రూపాయలు అందుతాయని అన్నారు. అలాగే ప్రతి ఏటా రానున్న నాలుగేళ్ల పాటు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున రాజధాని నిర్మాణానికి ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకల్లా రైల్వే జోన్ ప్రకటన వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 2014-15 నాటి రాష్ట్ర లోటు బడ్జెట్ పూర్తి చేసేందుకు వివిధ రూపాల్లో నిధులను కేంద్రం అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి కేంద్రం ప్రకటించిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు చేపట్టనున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News