: రెండోసారి మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ గా సిస్టర్ ప్రేమ
మదర్ థెరెస్సా నెలకొల్పిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ గా సిస్టర్ మేరీ ప్రేమ రెండోసారి ఎన్నికయ్యారు. ఆరేళ్ల పదవీకాలం గల ఈ పదవికి జర్మనీకి చెందిన 61 ఏళ్ల సిస్టర్ మేరీ ప్రేమ 2009లో తొలిసారి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె రెండోసారి ఎన్నికయ్యారని మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. తాజా ఎన్నికతో ఆమె మరో ఆరేళ్లపాటు మదర్ జనరల్ గా విధులు నిర్వర్తించనున్నారు. 2009లో సిస్టర్ నిర్మలా జోషి నుంచి ఆమె విధులు స్వీకరించారు. మదర్ జనరల్ గా నియామకం కంటే ముందు ఆమె యూరోపియన్ రీజినల్ జనరల్ గా విధులు నిర్వర్తించారు.