: ఢిల్లీలో మహిళల ఆధ్వర్యంలో క్యాబ్ సర్వీసులు
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ డీఎంసీ) ఆధ్వర్యంలో మహిళా క్యాబ్ సర్వీసులు నడిపించే ఆలోచనలో అధికారులున్నారు. బస్సులు, ట్యాక్సీల్లో మహిళలపై జరుగుతున్న నేరాలకు చెక్ పెట్టేందుకు క్యాబ్ సేవలందించే బాధ్యత మహిళలకే అప్పగిస్తే సరిపోతుందని ఎన్ డీఎంసీ భావిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మార్చి 8న 20 ట్యాక్సీలను 'శక్తి' పేరిట ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, విధివిధానాలు ఒక కొలిక్కి రాకపోవడంతో 'శక్తి' ట్యాక్సీల ప్రారంభం వాయిదా పడింది. త్వరలోనే వీటిని ప్రారంభించాలని ఎన్ డీఎంసీ భావిస్తోంది. మహిళా క్యాబ్ సర్వీసులు ప్రారంభమై అత్యాచారాలకు చెక్ పెడితే, దేశ రాజధాని ప్రతిష్ఠ పెరుగుతుందని ఎన్ డీఎంసీ ఆశిస్తోంది.