: లాహోర్ పేలుళ్లకు పాల్పడింది మేమే: జమాతుల్ అహ్రర్


పాకిస్థాన్ లోని లాహోర్ లోని యొహానాబాద్ లో రెండు క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని జమాతుల్ అహ్రర్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రెండు చర్చిలలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 15 మంది మృతి చెందగా, 80 మంది క్షతగాత్రులుగా మారారు. దీనిపై పాకిస్థాన్ లోని క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. వారికి పలు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, ఇతరులు మద్దతు తెలిపారు. ఈ ఘటనలో అనుమానితులుగా భావించిన ఇద్దరిని పట్టుకున్న స్థానికులు వారిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News