: క్వార్టర్స్ లో జట్ల ప్రత్యర్థులు వీరే... అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
లీగ్ దశ ముగియడంతో రెండో రౌండ్ కోసం జట్లన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పాయింట్ల టేబుల్ ఆధారంగా క్వార్టర్స్ లో పాల్గొంటున్న జట్ల వివరాలు..ఏ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో చోటు సంపాదించుకున్నాయి. బీ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు క్వార్టర్స్ లో స్థానం సంపాదించుకున్నాయి. దీంతో మార్చి 18న జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాజట్టుతో శ్రీలంక తలపడనుంది. మార్చి 19 న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్ లో భారత జట్టుతో బంగ్లాదేశ్ జట్టు ఆడనుంది. 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ పోరాడనుంది. 21న న్యూజిలాండ్ జట్టుతో వెస్టిండీస్ జట్టు ఆడనుంది. దీంతో అప్పుడే సెమీఫైనల్ బెర్తులపై చర్చ మొదలైంది.