: సినీ పరిశ్రమకు ఎల్లవేళలా సహకారం అందిస్తాం: తలసాని


తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా సహాయసహకారాలు అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లోని తెలుగు సినీ కళాదర్శకుల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుతామని అన్నారు. ఈ నెల 20న సినీ పరిశ్రమలోని పెద్దలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News