: కుంగిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్...దళిత వాడ అప్రమత్తం


కర్నూలు జిల్లా కౌతాళంలో సమ్మర్ వాటర్ స్టోరేజీ ట్యాంక్ ఆనకట్ట కుంగిపోయింది. ఇది ఏ క్షణానైనా కొట్టుకుపోయే ప్రమాదముందని గమనించిన అధికారులు, ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. తక్షణం కౌతాళం ఎస్సీ కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. 11 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందిస్తున్న ఈ సమ్మర్ వాటర్ స్టోరేజీ ట్యాంక్ ఆనకట్టపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు నీటిని బయటకు తోడి పోస్తున్నారు. ఈ స్టోరేజీ ట్యాంక్ ఆనకట్టను 2009లో 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. అప్పటి నుంచి ఇది స్థానికుల దాహార్తిని తీరుస్తోంది. దీనిపై ఎంపీ రేణుక అధికారులతో మాట్లాడారు. ఆనకట్ట నీటిని వినియోగించేందుకు అవసరమైతే పైపుల నిర్మాణం చేపట్టాలని ఆమె సూచించారు. అందుకు అవసరమైతే ఎంపీల్యాండ్స్ నిధులు వినియోగించుకోవాలని ఆమె అధికారులను కోరారు.

  • Loading...

More Telugu News