: ఇప్పుడు లక్ష్యం చర్చ్ లు...పది మంది మృతి...ఇద్దరు సజీవ దహనం
పాకిస్థాన్ లోని లాహోర్ లోని యొహానాబాద్ లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. సాధారణంగా శుక్రవారం పూట, మసీదులను లక్ష్యం చేసుకునే తీవ్రవాదులు, ఈ సారి ఆదివారం రద్దీగా ఉండే చర్చిలను లక్ష్యం చేసుకున్నారు. ఆదివారం ప్రార్థనల కోసం చర్చ్ లకు చేరుకున్న భక్తులను హతమార్చే ఉద్దేశ్యంతో ఇద్దరు వ్యక్తులు రెండు చర్చ్ ల వద్ద ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో పది మంది అమాయక పౌరులు మృతి చెందగా, ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకున్నారు. వారిని చితకబాది సజీవ దహనం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చారు. ఈ బాంబుదాడులు జరిపింది తామేనని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ దాడులను పాక్ ప్రధాని ఖండించారు.