: రాష్ట్రాలు విడిపోయినా తెలుగువాళ్లు అన్నదమ్ములే: వెంకయ్యనాయుడు


రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వాళ్లంతా అన్నదమ్ములేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. తొందర్లోనే భద్రాచలం, విజయవాడ హైవే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు కలసికట్టుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News