: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త... పాక్ మినహా సార్క్ దేశాల పర్యటనకు ఎల్ టీసీ!


సార్క్ దేశాలను సందర్శించాలని భావించే వారికి సౌలభ్యంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్ టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) సదుపాయం దగ్గర కానుంది. పాక్ మినహా మిగతా దేశాలను ఉద్యోగులు సందర్శించవచ్చని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఎల్ టీసీలో భాగంగా అర్హులైన ఉద్యోగులకు సెలవుతో పాటు సంబంధిత టూర్ కు ప్రయాణ చార్జీలను అందిస్తారన్న సంగతి తెలిసిందే. సార్క్ దేశాల మధ్య టూరిజంను మరింతగా పెంచుతూ, ప్రజల మధ్య సంబంధాలను మెరుగు పరిచే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు జితేంద్ర వివరించారు.

  • Loading...

More Telugu News