: అసభ్యకరంగా ప్రవర్తించినందునే కొరికా.. ఆ శాస్తి జరగాల్సిందే!: కేరళ మహిళా ఎంఎల్ఏ
కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు కాంగ్రెస్ సభ్యుడు కే శివదాసన్ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందునే కొరికానని, అతనికి ఆ శాస్తి జరగాల్సిందేనని యూడీఎఫ్ సభ్యురాలు జమీలా ప్రకాశం వివరణ ఇచ్చారు. వెనక నుంచి శివదాసన్ తన చేతిని మెలిపెట్టాడని, నడుముపై చేయి వేశారని ఆమె ఆరోపించారు. వెనక్కు తిరిగిచూస్తే శివదాసన్ కనిపించాడని, ఒకసారి హెచ్చరించినా, ప్రవర్తన మారకపోవడంతో కొరికానని ఆమె అంగీకరించారు. కాగా, ముఖ్యమంత్రి చాందీని రక్షించడానికి తాను నిలిస్తే, మహిళా సభ్యురాలు తనను కొరికిందని గాట్లు చూపుతూ, శివదాసన్ ఫిర్యాదు చేశారు. ఓ మహిళను ఎవరైనా వేధిస్తే, ఆమె తన నోటి పండ్లు, వేలి గోర్లతో ప్రతిదాడి చేయవచ్చని సీపీఐ ఎంఎల్ఏ ఎం.ఏ.బేబీ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, శివదాసన్ తన చెయ్యిని జమీలా ప్రకాశం నడుముపై వేసినట్టున్న ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.