: సొంత ఎమ్మెల్యేలకు డబ్బులిస్తున్న బాబు... తలసాని తీవ్ర విమర్శలు


తెలంగాణలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, సొంత పార్టీ ఎంఎల్ఏలకు ఆయన కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి టీఆర్ఎస్ లోకి వలస వెళ్ళకుండా ఆపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. తమను టీఆర్‌ఎస్ పిలుస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్‌ మెయిల్ చేస్తోంటే వారికి కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చంద్రబాబు వచ్చాడని ఆయన విమర్శించారు. తాను టీడీపీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతనే మంత్రి మండలిలో చేరానని, రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగులో ఉందని గుర్తు చేశారు. తను మండలికి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, సనత్‌ నగర్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు సైతం తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్‌ఎస్‌ లో చేరతానని సీఎం కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News