: పేలిన గ్యాస్ సిలిండర్... 18 ఇళ్లు దగ్ధం
మరో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వీఆర్ పురం మండలం చింతరేవు పాలెంలో జరిగింది. ఈ దుర్ఘటనలో 18 ఇళ్లు దగ్ధం అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. కనీసం 10 మంది వరకూ గాయపడ్డట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గ్యాస్ సిలిండర్ కారణమా? లేక, పేలుడు పదార్థాలు ఏవైనా ఇంట్లో ఉంచారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.