: టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా వస్తానంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్


కివీస్ జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలందించిన క్రిస్ హ్యారిస్ రిటైర్మెంటు ప్రకటించి చాన్నాళ్లయింది. ఇప్పుడు టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా వస్తానంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. కోచింగ్ అంశంలో కొద్దిగా తర్ఫీదయ్యానని, ఓ అంతర్జాతీయ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేయడాన్ని ప్రేమిస్తానని తెలిపాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేయడాన్ని తప్పక ఇష్టపడతానని, టీమిండియా మెరుగుపర్చుకోవాల్సిన అంశాల్లో ఫీల్డింగ్ కూడా ఒకటని పేర్కొన్నాడు. భారత్ కు బ్యాటింగ్ లో తిరుగులేదని, కొందరు నాణ్యమైన బౌలర్లు కూడా దొరికారని, అయితే, ఫీల్డింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఫీల్డింగ్ నైపుణ్యమనేది దృక్పథానికి సంబంధించిన విషయమని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News