: లండన్ పార్లమెంటు స్క్వేర్ వద్ద గాంధీజీ విగ్రహావిష్కరణ
లండన్ లోని పార్లమెంటు స్క్వేర్ లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. వందేళ్ల కిందట ఇదేరోజు గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చి దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా పోరాటం ప్రారంభించారు. అందుకు గుర్తుగానే తొమ్మిది అడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లండన్ పార్లమెంటు వద్ద ఓ భారతీయుడి విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.