: రైనా సెంచరీ, ధోనీ హాఫ్ సెంచరీ... విజయం ముంగిట టీమిండియా


జింబాబ్వేతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం దాదాపుగా ఖరారైంది. భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా సెంచరీతో చెలరేగాడు. కేవలం 94 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్స్ లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ ధోనీ(56) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వికెట్లను పడగొట్టడంలో జింబాబ్వే బౌలర్లు విఫలమయ్యారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ధోనీ, రైనాలు సద్వినియోగం చేసుకుని పరుగుల వదర పారించారు. 45 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా 249 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News