: ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధం... నాపై ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే: తలసాని
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. గడచిన ఎన్నికల్లో టీడీపీ తరఫున సనత్ నగర్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీంతో హతాశులైన టీ టీడీపీ నేతలు, తలసానిని అనర్హుడిగా ప్రకటించాలని ఎప్పడికప్పుడు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం దీనిపై తలసాని ఘాటుగా స్పందించారు. సనత్ నగర్ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తనపై పోటీ చేసి ఓడిన వ్యక్తి మాత్రం రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు.