: బ్రిటన్ పార్లమెంటులో ‘మన్మథ’నామ ఉగాది... వరుసగా రెండో ఏడాది వేడుకలు


తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెల్ల పాలకుల నేల బ్రిటన్ లో ఘనంగా జరగనున్నాయి. అది కూడా బ్రిటిషర్ల చట్టసభ పార్లమెంటులో ఈ వేడుకలు జరగనుండటం విశేషం. తెలుగు ప్రవాస భారతీయుల ఫోరం (టీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో గతేడాది బ్రిటన్ పార్లమెంట్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకల్లో అక్కడి తెలుగు ప్రజలతో పాటు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ భవన సముదాయంలోని పదో నెంబరు కమిటీ హాలులో ఈ సారి ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 25న జరగనున్న ఈ వేడుకలకు ఆ దేశ పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపారట. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జరిగే వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అంతేకాక తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, వివిధ రకాల పోటీలు, బహుమతి ప్రదానం తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయట. ఈ వేడుకలకు తెలుగు వారికే కాక అక్కడున్న కన్నడిగులు, తమిళులు, మరాఠీలకు కూడా ఆహ్వానాలు పంపామని టీఎన్ఎఫ్ యూకే అద్యక్షుడు రమేశ్ ఉడత్తు తెలిపారు.

  • Loading...

More Telugu News