: మన్మోహన్ కు మహిళా కాంగ్రెస్ సంఘీభావం... కంటతడి పెట్టిన ఆయన భార్య
బొగ్గు క్షేత్రాల కుంభకోణం కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సమన్లు పంపడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దాంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ప్రతినిధి బృందం మన్మోహన్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకుని సంఘీభావం ప్రకటించింది. తామంతా మీకు అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆయన భార్య గుర్ శరణ్ కౌర్ కంటతడి పెట్టారు. కాగా, రెండురోజుల కిందట పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ర్యాలీతో వచ్చి ఈ మాజీ ప్రధానికి సంఘీభావం తెలిపారు.