: జానా... మీ మాట మాకు శిరోధార్యం... మిమ్నల్ని కాదని ముందుకెళ్లం: కేసీఆర్
తెలంగాణ శాసనసభలో నిన్న ఆసక్తికర సన్నివేశం నెలకొంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలెలా తీసుకుంటారన్న ప్రతిపక్షాల నిలదీతపై విరుచుకుపడతారనుకున్న సీఎం కేసీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సాగునీటి ప్రాజెక్టు విషయంలో మాట్లాడిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, అధికారపక్షాన్ని నిలదీశారు. ప్రాజెక్టుల పురోగతిని పట్టించుకోవట్లేదని నిరసన తెలిపారు. దీంతో స్పందించిన కేసీఆర్, ‘‘జానారెడ్డి గారూ... మీ మాట మాకు శిరోధార్యం. మిమ్మల్ని కాదని ముందుకెళ్లం. ప్రతి విషయంలో మీ సలహాలు, సూచనలు తీసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అటు విపక్షంతో పాటు అధికార పార్టీ సభ్యులు కూడా విస్మయానికి గురయ్యారు.