: రాజ్యసభకు ఎన్నికైన మరో బాలీవుడ్ నటుడు
ఇప్పటికే రాజ్యసభలో బాలీవుడ్ నటులు, నటీమణులు కొందరు కొలువుదీరారు. తాజాగా, మరో బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ డోగ్రియాల్ మరణంతో ఏర్పడిన ఖాళీలో... రాజ్ బబ్బర్ ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. గతంలో రాజ్ బబ్బర్ సమాజ్ వాది పార్టీలో ఉంటూ... ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అనంతరం, ఎస్పీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఉత్తరాఖండ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.