: స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలపై అనవసర రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అంజయ్య


టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. సర్పంచ్ ల జీతాలు పెంచలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు ప్రత్యేక గౌరవం తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కౌన్సిలర్, సర్పంచ్ మొదలుకొని జెడ్పీ ఛైర్మన్ వరకు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలను పెంచుతున్నట్టు తెలంగాణ శాసనసభలో కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News