: 33 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే... ఈ సారి మోహిత్ వంతు!


భారత్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ల పతనం కొనసాగుతోంది. 5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు, కొద్దిసేపటి క్రితం మరో వికెట్ ను చేజార్చుకుంది. టీమిండియా పేసర్లు వంతుల వారీగా వికెట్లు పడగొడుతున్నారు. తొలి రెండు వికెట్లను ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీలు పడగొట్టగా, మూడో వికెట్ ను మోహిత్ శర్మ నేలకూల్చాడు. మోహిత్ వేసిన బంతిని సోలోమోన్ మైర్ (9) నేరుగా కీపర్ ధోనీ చేతుల్లోకి ఆడాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి 33 పరుగులు చేసిన జింబాబ్వే మూడో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది.

  • Loading...

More Telugu News