: పూరీ జగన్నాథ్ ఇంటిలో చోరీ... రూ.15 లక్షల విలువ చేసే నగలు అపహరణ
హైదరాబాదులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిలో చోరీ జరిగింది. నిన్న మధ్యాహ్నం వెలుగుచూసిన ఈ ఘటనలో పూరీ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు ఆయన భార్యకు చెందిన నగలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ15 లక్షలకు పైగా ఉందట. ఈ మేరకు పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇంటిలో లేని సమయంలో ఈ చోరీ జరిగిందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఇటీవల వరుస చోరీలు జరుగుతున్నాయి. పూరీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.