: అవినాష్ కు రిమాండ్...పెద్దాపురం సబ్ జైలుకు తరలింపు
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాల పేరిట పలు మోసాలకు పాల్పడ్డ అవినాష్ ను పెద్దాపురం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. దీంతో, అవినాష్ ను పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు. ఇతగాడి అక్రమాలను జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ మీడియాకు వివరించారు. ఉద్యోగాలిప్పిస్తానని కొందరు నిరుద్యోగులను వంచించాడని, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సదరన్ రీజియన్ ప్రెసిడెంటునంటూ చెప్పుకుని తిరిగేవాడని తెలిపారు. ఏపీ హోం మంత్రి చినరాజప్ప బంధువునంటూ కూడా అవినాష్ ఎన్నో మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.