: టీఆర్ఎస్ అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ నేతలకు మతిభ్రమిస్తోంది: రవీందర్ రెడ్డి


కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ నేతలకు మతిభ్రమిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు అన్ని పనులు పూర్తి చేస్తే ఇక చేయడానికి తమకేం మిగలదనే రీతిలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ పథకాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు.

  • Loading...

More Telugu News