: అవినాష్ ను కాకినాడలో విచారిస్తున్న పోలీసులు... పోలీసుల అదుపులో అనుచరులు!


ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్రను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. అక్కడ రహస్య ప్రాంతంలో అతడిని విచారిస్తున్నారు. తరువాత అతనికి వైద్య పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు, అవినాష్ అనుచరులు రామకృష్ణ, వేణుగోపాల్ లను కూడా కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ పారిపోతున్నట్టు సమాచారం తెలియడంతో కృష్ణాజిల్లా చిల్లకల్లు టోల్ గేట్ వద్ద వారిని అరెస్టు చేశారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

  • Loading...

More Telugu News