: మహిళా ఎమ్మెల్యే తనను కొరికిందంటూ కేరళ కాంగ్రెస్ సభ్యుడి ఆరోపణ!
కేరళ అసెంబ్లీలో ఈరోజు రణరంగ వాతావరణం నెలకొనగా, అధికారపక్ష సభ్యులను లోపలికి రానివ్వకుండా విపక్ష సభ్యులు సభ తలుపులు మూసివేశారు. అయితే, సభలో ఇలా తీవ్ర గందరగోళం నెలకొన్న సమయంలో విపక్ష, అధికార పక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసుకున్నారు కూడా. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు శివదాసన్ నాయర్ ను వామపక్ష మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం కొరికారట! ఈ విషయాన్ని నాయర్ స్వయంగా మీడియాకు చెప్పారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి రక్షణగా తాను నిలుచున్న సమయంలో ఎమ్మెల్యే జమీలా కొరికారంటూ తన చేతికైన గాయాలను కూడా ఆయన చూపించారు. ప్రస్తుతం ఈ విషయం కేరళ మీడియాలో ఆసక్తిని రేపుతోంది.